NRML: విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలని డిఇఓ భోజన్న అన్నారు. మంగళవారం లక్ష్మణ్ జండా మండలంలోని వడ్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి నైపుణ్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు.