Pawan Kalyan:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో (chandrababu) జనసేన అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) సమావేశం అయ్యారు. ఇటీవల కూడా చంద్రబాబును పవన్ కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి భేటీలో చర్చించే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ (pawan kalyan) ఇటు బీజేపీ నేతలను కలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిస్థితులు.. ప్రజా సమస్యలపై ఇద్దరు నేతలు డిస్కష్ చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలుస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం తాము టీడీపీతో కలువబోం అని చెబుతున్నారు. త్రిముఖ పోరు ఉండదని.. జనసేనతో కూడా కలిసి పోటీచేసే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కలిసి పోటీ చేయాలని బాబు (babu)-పవన్ (pawan) నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పోటీపై అధికార ప్రకటన మాత్రం రాలేదు.
2014లో టీడీపీతో ఉన్న జనసేన, 2019 తర్వాత బీజేపీకి దగ్గరైంది. ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ సమావేశం అవుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.పవన్ కల్యాణ్‌ను విశాఖ పట్టణంలో అడ్డుకున్నారు. తర్వాత చంద్రబాబు విజయవాడలో గల నోవాటెల్ హోటల్‌కు వెళ్లి జనసేనానిని పరామర్శించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో సమావేశం జరిగింది. ఈ రోజు చంద్రబాబు, పవన్ మరోసారి భేటీ అయ్యారు.