PPM: బాల్య వివాహాన్ని అడ్డుకుని పాలకొండ శక్తి టీమ్ ఆదర్శంగా నిలిచింది. తుమరాడ గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికకు వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న టీమ్ సభ్యులు, వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే శారీరక, మానసిక అనర్ధాలను తల్లిదండ్రులకు వివరించి, వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు వారు మనసు మార్చుకుని పెళ్లిని నిలిపివేశారు.