»Ys Sharmila Inspects Damaged Farms In Jangaon District
Rythu Bandhuపై షర్మిల కీలక వ్యాఖ్యలు.. ముష్టి బంధు అంటూ విమర్శలు
పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు అని షర్మిల విమర్శించారు.
పోలీసులపై దాడి చేసి జైలుకు వెళ్లి వచ్చిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మళ్లీ రాజకీయ కార్యాచరణ ప్రారంభించారు. కొంత విశ్రాంతి తీసుకున్న అనంతరం మూడు రోజుల తర్వాత మరోసారి ప్రజల వద్దకు వచ్చారు. ఈసారి అకాల వర్షాలతో (Untimely Rains) దెబ్బతిన్న పంటలను ఆమె పరిశీలించారు. మరోసారి సీఎం కేసీఆర్ (KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. రైతు ద్రోహి కేసీఆర్ అంటూ విమర్శించారు. జనగామ జిల్లాలో (Jangaon District) శనివారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు.
బచ్చన్నపేట (Bachanapet) మండలం అలీంపూర్ గ్రామంలో దెబ్బతిన్న పంటలను (Damaged Farms) షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘జనగామ జిల్లావ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టపోయి రైతులు సర్వం కోల్పోయారు. ఇంత నష్టం జరిగినా సీఎం కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదు. గతనెల 23న హెలికాప్టర్ (Helicopter)లో వచ్చి పరిశీలించి వెళ్లిన సీఎం అప్పుడు ఎకరాకు రూ.10 వేల సహాయం ప్రకటించారు. కానీ నెల దాటినా ఒక్క రూపాయి ఇవ్వలేదు’ అని షర్మిల విమర్శించారు.
తొమ్మిదేళ్లుగా దాదాపు రూ.14 వేల కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు బంధుపై (Raithu Bandhu) షర్మిల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ముష్టి రైతుబంధు’ అంటూ వ్యాఖ్యానించారు. ‘ముష్టి రైతుబంధు ఇచ్చి సీఎం కేసీఆర్ రైతును ఉద్దరించినట్లు బిల్డప్ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు ద్రోహి’ అని ధ్వజమెత్తారు. ఒక్కో ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి రైతులు అకాల వర్షాలతో నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి లక్ష్యం లేదు అని విమర్శించారు. రూ.30 వేలు నష్టం జరిగిందని చెబుతుంటే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు. ఎకరాకు రూ.10 వేలు కాదు రూ.30 వేలు నష్ట పరిహారం (Financial Assitance) ఇవ్వాలని డిమాండ్ చేశారు.