»Badminton Asia Championship Chirag Satwiksairaj Assure Doubles Medal After 52 Years To India
Badminton Asia Championshipలో చరిత్ర రిపీట్.. 52 ఏండ్ల తర్వాత భారత్ ఖాతాలో మెడల్
సాత్విక్-చిరాగ్ జంట 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ లో కూడా సత్తా చాటితే ఫైనల్ కు వెళ్లి టైటిల్ ను సొంతం చేసుకోనుంది. బంగారు పతకం సొంతం చేసుకుంటే రికార్డులు తిరగరాసినట్టే.
ప్రపంచ క్రీడల్లో భారతదేశం (India) సగర్వంగా నిలుస్తోంది. బ్యాడ్మింటన్, క్రికెట్, టెన్నిస్, చెస్, కబడ్డీ, రెజ్లింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నీస్, అథ్లెటిక్స్ తదితర క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతున్నారు. అయితే ఒక్క ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ (Badminton Asia Championship)లో మాత్రం భారత్ కు ఐదు దశాబ్దాలుగా ఒక్క పతకం దక్కడం లేదు. ఆ మెగాటోర్నీలో 52 ఏండ్ల తర్వాత భారత్ ఖాతాలో ఒక పతకం ఖాయమైంది. సాత్విక్ సాయిరాజ్ (Satwiksairaj Rankireddy)- చిరాగ్ శెట్టి (Chirag Shetty) జోడీ సత్తా చాటి మన దేశానికి ఒక పతకాన్ని తీసుకువస్తున్నారు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పురుషుల డబుల్స్ (Men Doubles)లో సాత్విక్-చిరాగ్ జోడీ సెమీస్ (Semi Final)కు దూసుకెళ్లింది. 21-11, 21-12 తేడాతో ఇండోనేసియా ద్వయం అహసన్- హెంద్రా సెతియవాన్ ను భారత బృందం ఓడించింది. ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ జంట 52 ఏళ్ల తర్వాత ఆసియా చాంపియన్ షిప్ పురుషుల డబుల్స్ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఇక సెమీస్ లో కూడా సత్తా చాటితే ఫైనల్ కు వెళ్లి టైటిల్ ను సొంతం చేసుకోనుంది. బంగారు పతకం సొంతం చేసుకుంటే రికార్డులు తిరగరాసినట్టే.