కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 20ఏళ్ల క్రితం తన గ్రామంలో జరిగిన ఓ ఘర్షణ నుంచి ‘కాంతార’ కథ పుట్టిందని తెలిపారు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారని.. తాను కేవలం ఆ సీన్స్ విజువల్స్ మాత్రమే ఊహించుకున్నానని చెప్పారు. తన వెనుక ఏదో శక్తి ఉండి వాటిని రాయించిందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.