HNK: హసన్పర్తి మండలం ఎర్రగట్టు గుట్టలోని రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆరు అడుగుల భారీ నాగుపాము కలకలం రేపింది. పామును చూసిన విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకొని సమీపంలోని గుట్టల్లోకి వదిలిపెట్టడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో పాఠశాల పరిసరాలను శుభ్రం చేయాలని విజ్ఞప్తి చేశారు.