»Breaking Jdu Leader Kailash Mahto Was Shot Dead On The Spot Bihar
Breaking: JDU నేత మహతోపై తుపాకీ కాల్పులు..స్పాట్ డెడ్
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జేడీయూ(JDU) నాయకుడు కైలాష్ మహతో(kailash Mahto) నిన్న రాత్రి కతిహార్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బీహార్‌లోని కతిహార్(bihar Katihar)లోని బరారీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.
అయితే కైలాష్ పై దాదాపు 4 నుంచి 5 రౌండ్లు దుండగులు కాల్పులు జరిపారని పోలీసులు(police) ప్రాథమికంగా గుర్తించారు. పోస్ట్ మార్టం తర్వాత మాత్రమే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈ కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Bihar | JD(U) leader Kailash Mahto was shot dead in Katihar yesterday. The incident took place in Katihar's Barari Police Station area. We have started an investigation and the accused will be arrested soon. Around 4-5 round of firing was done. Further details can only be given… pic.twitter.com/xx3NBcTa2p