NTR: కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని బోయపాటి శివరామకృష్ణయ్య, కర్నాటి రామ్మోహనరావు మున్సిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలు అత్యంత పకడ్బందీగా, సజావుగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల అధికారులు నిరంతరం సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.