»Tiger Attack On Tourists Uttarakhand National Park Viral Video
Viral Video: టూరిస్టులపై పులి ఎటాక్..జస్ట్ మిస్సు
పార్కు(park)లో సఫారీ వానంలో వెళుతున్న క్రమంలో పొదల వెనుక దాక్కున్న పులి(tiger)ని టూరిస్టులు ఫొటో తీయాలని కెమెరా బయటకు తీశారు. కానీ వారిని గుర్తించిన తర్వాత పులి పర్యాటకులపై ఎటాక్ చేసేందుకు ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనం ముందుకు తీసుకెళ్లి టూరిస్టులను కాపాడాడు. నెట్టింట చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.
ఓ జాతీయ పార్కు(national park)లో సరదాగా గడిపేందుకు సఫారీ వాహనంలో టూరిస్టులు పర్యటిస్తున్నారు. అదే క్రమంలో ఓ ప్రాంతంలో వారికి పులి కనిపించింది. ఆ నేపథ్యంలో టూరిస్టులు పులి(tiger)ని ఫొటో తీసేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పులి వారిని గమనించి తనపై దాడి చేస్తున్నారేమో అనుకుని.. టూరిస్టులపై ఎటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఆ సఫారీ వాహనాన్ని కొంచెం దూరం కోపంతో అరుస్తూ వెంబడించింది. దీంతో ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
ఈ వీడియోను సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే వాటికి కూడా స్పేస్ ఇవ్వాలని, వండర్ ఫుల్ బీస్ట్ అంటూ కామెంట్లు చేశారు.
మరోవ్యక్తి అయితే సఫారీ వాహనం డ్రైవర్ తెలివిగా వ్యవహరించాడని పేర్కొన్నాడు. దీని ద్వారా అప్పుడప్పుడు “పులులను” చూడాలనే మన అత్యుత్సాహం వాటి జీవితాలకు అసౌకర్యాన్ని కలిగిస్తుందని, మన జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియో(social media)లో తెగ చక్కర్లు కోడుతుంది. ఇప్పటికే ఈ వీడియోను 6 లక్షల మందికిపైగా చూసేశారు. ఈ నేపథ్యంలో ఈ వైరల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Striped monk gets irritated 😣 What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR