»40 Women Have Only One Husband He Is Also The Father Of Their Children
Bihar : 40 మందికి ఒక్కడే మొగడు.. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి షాకైన ఆఫీసర్లు
అర్వాల్లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్‌చంద్ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు.
Bihar : బీహార్ ప్రభుత్వం(Bihar Govt) కొంత కాలం నుంచి కుల గణన(Caste enumeration) చేపడుతోంది.ప్రజల ఆర్థిక, సామాజిక నేపథ్యం తెలుసు కుని వారి అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కుల గణన కోసం ప్రభుత్వం ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని కోసం ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) ఇంటింటికీ వెళ్లి 17 అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే అర్వాల్‌లోని రెడ్‌లైట్ ఏరియా(Red light area)కు వెళ్లిన అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది.
అర్వాల్లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్‌చంద్ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్(Roop Chand) అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు. అసలు నిజం ఏంటో తెలుసుకుందామని ఆ మహిళలు ఉంటున్న రెడ్ లైట్ ఏరియాకు వెళ్లారు. విషయం తెలుసుకొని షాక్ తిన్నారు.
అర్వాలో లోని వార్డు నంబర్-7 ఓ రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో సెక్స్ వర్కర్లు(Sex workers) సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. కుల గణన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చినప్పుడు వారిలో దాదాపు 40 మంది మహిళల భర్త పేరు రూప్‌చంద్ అని తెలిపారు. వారి పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్(roop chand) అని చెప్పారు. అసలు నిజం ఏంటో తెలుసుకుందామని అధికారులు ఎంక్వేరీ చేశారు అసలు రూప్ చంద్ అంటే మనిషి కాదని తేలింది. అక్కడున్న వారందరూ డబ్బును రూప్ చంద్ అని అంటారు. అక్కడి ప్రజల అభిప్రాయం ప్రకారం రూపాయి అంటే రూప్ చంద్ అని అర్థం. రెడ్ లైట్ ఏరియాలో నివసించే ప్రజలు రూపాయినే తమ సర్వసంగా భావిస్తారు. పిల్లలు కూడా అలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉన్నారు. అందుకే తమ భర్త, తండ్రి పేరు ఏమంటే అందరూ రూప్ చంద్ అనే చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశంలోనే తొలిసారిగా ఆ రాష్ట్రంలోనే కుల గణన చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.