Vande Bharat : ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రతిష్టాత్మకంగా మంగళవారం కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురంలో వందేభారత్ ట్రైన్(Vande Bharat Train)ను జెండా ఊపి ప్రారంభించారు. తొలి రోజే వందేభారత్ ట్రైన్లో నీరు లీకైంది. తిరువనంతపురం(Thiruvananthapuram) నుంచి కాసరగడ్ బయల్దేరిన ఈ ట్రెయిన్ ఏసీ గ్రిల్(AC Grill) లో నీరు లీకవుతున్నట్టు అధికారులు గుర్తించారు. వెంటనే కన్నూర్ రైల్వే స్టేషన్ లో రైలును నిలిపివేశారు. వారిచ్చిన సమాచారంతో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ(Coach Factory)కి చెందిన సాంకేతిక నిపుణులు వచ్చి నీటి లీకేజీని నిలిపివేశారు. ఆ తరువాత రైలు కాసరగడ్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది.
వర్షం కారణంగానే ఈ బోగీలో నీరు లీక్ అయిందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో కాసరగడ్ నుంచి ఇది తిరిగి కన్నూర్(Kannur) చేరుకుంది.. నీటి లీకేజీని ఆపేందుకు సిబ్బంది చేస్తున్న మరమ్మతు దృశ్యాల తాలూకు వీడియోలు వైరల్(Viral) అయ్యాయి. రైలును ప్రారంభించిన మొదటి రోజే ఇలాంటి లోపం తలెత్తడంపై పలువురు నెటిజన్లు స్పందించారు. అయితే ఇలాంటి చిన్న చిన్న లోపాలు సహజమేనని, దీన్ని గోరంతలు కొండంతలు చేయవద్దని రైల్వే అధికారులు కోరుతున్నారు. వాటర్ లీకేజీపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు వారు వెల్లడించారు.