TG: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తొలిసారిగా దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. రేపటి నుంచి వచ్చే నెల 4 వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఇచ్చింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు అధికారులను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలని సూచించారు.