NLG: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిలో భాగంగా జిల్లాకు 4.65 లక్షల సంచులను మండల స్థాయి గోదాములుకు పంపించడం జరిగింది. సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఒకటి చొప్పున ఈనెల రేషన్తో పాటు అందజేయనున్నారు.