SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో రేపు తల్లిదండ్రుల-అధ్యాపకుల సమావేశం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ గురువారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, కళాశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని అన్నారు.