MNCL: టీబీ రహిత సమాజానికి అందరూ పాటుపడాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట పీహెచ్సి వైద్యులు డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు. గురువారం లక్షెట్టిపేట మండలంలోని కొత్తూర్, మోదెల గ్రామాలలో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అలాగే 160 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీబీ సూపర్ వైజర్ సురేష్ పాల్గొన్నారు.