ATP: MLA దగ్గుపాటి ప్రసాద్ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు సృష్టించిన వారిపై అనంతపురంలోని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుట్రలో భాగంగా ఇలా చేశారని ఎమ్మెల్యే సోషల్ మీడియా టీం సభ్యులు తెలిపారు. ఎమ్మెల్యే ట్విటర్ అసలు ఖాతా @PrasadDOfficial అని, @Prasadoficial అనే నకిలీ ఖాతా ద్వారా తప్పుదారి పట్టే పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.