సత్యసాయి: హిందూపురం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం సీపీఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సీపీఐ కాలనీలో, ప్రభుత్వ ఎస్టీ గర్ల్స్ కాలేజ్ హాస్టల్, బీసీ గర్ల్స్ హాస్టల్లో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. ఈపాగింగ్ చేసి హిందూపురం ప్రజలను కాపాడాలని కోరారు.