VKB: జిల్లాలో గంజాయి రవాణా, అమ్మకంపై కఠిన చర్యలు తప్పవని SP K.నారాయణరెడ్డి హెచ్చరించారు. ఇటీవల గంజాయిపై పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఇక ఎవరైనా గంజాయి జోలికి వెళ్తే వదిలిపెట్టేది లేదు. ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటాం. గంజాయిపై సమాచారం ఉంటే పరిధి పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.