NLG: అక్టోబర్ 26, 27 తేదీలలో దేవరకొండలో జరగబోయే సీఐటీయూ జిల్లా 10వ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ సీఐటియూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. కార్మిక వర్గ హక్కుల కోసం సమరశీల ఉద్యమాలు నిర్మించిన చరిత్ర ఉందన్నారు.