E.G: వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నేటి నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఇవాళ తెలిపారు. లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.