ఈమధ్యకాలంలో వీధి కుక్కల(Street Dogs) దాడులు పెరుగుతున్నాయి. కుక్కల దాడిలో చాలా మంది గాయాలపాలవుతున్నారు. మరికొందరు చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. కుక్కల్ని చూస్తే చాలు జనాలు పరుగులు తీస్తున్నారు. వీధుల్లో నడిచేందుకు వణికిపోతున్నారు. పెంపుడు కుక్కలు(Dogs) కూడా కొన్ని చోట్ల దాడులు చేస్తూ స్థానికులను గాయపరుస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
గతంలో హైదరాబాద్ (Hyderabad)లో సీఐ అపార్టుమెంటులో పెంపుడు కుక్కలను ఉసిగొల్పిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో బాలుడ్ని వీధికుక్కలు(Street Dogs) పొట్టనబెట్టుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఏపీలో మరో ఘటన చోటుచేసుకుంది.
ఏపీలో వీధికుక్కల(Street Dogs) దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు విడిచింది. శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలోని సాత్విక అనే 18 నెలల చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో వీధి కుక్కలు చిన్నారిని చుట్టుముట్టాయి. సాత్వికపై దాడి చేశాయి. ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయాలపాలైంది. చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాత్విక ప్రాణాలు విడిచింది.