KRNL: పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో జయరాముడు గురువారం తెలిపారు. తహశీల్దార్, విద్యుత్ శాఖ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, హౌసింగ్ ఏఈ తదితరులకు నోటీసులు జారీ చేశామన్నారు. సర్వసభ్య సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని సిఫారసు చేసినా పెడచెవిన పెట్టి గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.