ADB: ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుజోయ్ డేను ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్లో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయ పురోగతి గూర్చి చర్చించినట్లు తెలిపారు. ఈ మేరకు సుజోయ్ సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.