కృష్ణా: మహిళలు బలవర్ధక ఆహారం తీసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్ అర్షియా సుల్తానా తెలిపారు. గురువారం మోపిదేవి మండలం వెంకటాపురంలో స్వస్థ్ ‘మహిళా – సశక్త్’ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ తుమ్మా సోములమ్మ ఈ శిబిరం ప్రారంభించారు. డాక్టర్ అర్షియా సుల్తానా పరీక్షలు చేసి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్లు తోట సుధాకర్, కే.విజయవల్లి పాల్గొన్నారు.