SRCL: వేములవాడలోని భీమేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అరుదైన ఘటన జరిగింది. భీమేశ్వర దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఓ వానరం హత్తుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. శివలింగాన్ని ఆ వానరం కాసేపు హత్తుకుని అలానే ఉండిపోయింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సన్నివేశాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అరుదుగా జరిగే ఈ సంఘటన అందరిని ఆశ్చర్యపరచండి.