VZM: జిల్లా కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ వినతులకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వినతులపై ప్రజల సంతృప్తి పెరగాలన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవ్, DRO శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.