KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామపంచాయతీ బంగారు పేటలోని గంగాభవాని అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ. రోజు బుధవారం గంగాభవాని అమ్మవారు అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్వహకులు అమ్మవారిని పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.