»11 692 New Corona Cases And 28 Deaths Have Been Recorded In The India
Covid Update: దేశంలో కొత్తగా 11,692 కరోనా కేసులు, 28 మరణాలు నమోదు
భారతదేశంలో శుక్రవారం(ఏప్రిల్ 21న) కొత్తగా 11,692 COVID-19 కేసులు, 28 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 44.8 మిలియన్లకు (4,48,69,684) చేరుకుంది.
దేశంలో గత 24 గంటల్లో 11,692 కొత్త కోవిడ్ -19 కేసులు(covid 19 cases), 28 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రభుత్వ గణాంకాలను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరింది. దేశంలోని మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.15 శాతంగా ఉన్నాయి. దీంతోపాటు జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరోవైపు మృతుల సంఖ్య 5,31,258కి పెరిగింది. ప్రస్తుతం జాతీయ COVID-19 రికవరీ రేటు 98.67 శాతంగా ఉంది. దీంతోపాటు 4,42,72,256 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. కాగా కోవిడ్ మరణాల రేటు 1.18 శాతానికి చేరుకుంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు భారతదేశంలో 2.2 బిలియన్ల కంటే ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్లు అందించబడ్డాయి. హర్యానా రాష్ట్ర ఆరోగ్య శాఖ దాని బులెటిన్ ప్రకారం 1,059 కొత్త COVID-19 ఇన్ఫెక్షన్లు, మూడు మరణాలు నమోదైనట్లు ప్రకటించారు. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.