delhi saketh court:ఢిల్లీ సాకేత్ కోర్టులో కాల్పుల (fire) కలకలం రేపాయి. లాయర్ (lawyer) దుస్తుల్లో వచ్చి దుండగులు విచక్షణరహితంగా ఫైరింగ్ (firing) చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి దుండగులు పారిపోయారు. కాల్పులు జరపడంతో మహిళ (woman) కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ మహిళను వెంటనే ఎయిమ్స్ (aiims) ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడిన మహిళ భర్తే ఫైర్ చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారి మధ్య విభేదాలు ఉండటంతో.. వచ్చి ఫైర్ చేశారని అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితుడు హిస్టరీ షీటర్ అని పోలీసులు చెబుతున్నారు.