కృష్ణా : పాత ఎడ్లంక గ్రామాన్ని కృష్ణానది వరదలతో కోత నుంచి పరిరక్షించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల జీరో అవర్ సమయంలో ఆయన అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక దీవి గ్రామం ఎదుర్కొంటున్న కోత సమస్య వివరించారు. కృష్ణానది వరదల నుంచి ఎడ్లంక దీవికి రక్షణ గోడ, వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.