సత్యసాయి: సోమందేపల్లిలో దేవి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మండలంలోని కొలువై ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.