ADB: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఇటీవల జందాపూర్ గ్రామంలో జరిగిన ఘటనపై నిందితురాలిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటూ వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.