NTR: విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు సన్నద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని కలెక్టర్ లక్ష్మిశా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ ఫామెక్స్-2026పై సమన్వయ శాఖల జిల్లాస్థాయి అధికారుల సమావేశం జరిగింది. 20 సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆధ్వర్యంలో ఫామెక్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు.