»22 Alcohol Shots In 90 Minutes In The Club British Tourist Died At Poland
Tourist died: క్లబ్లో 90 నిమిషాల్లో 22 మద్యం షాట్స్..బ్రిటిష్ టూరిస్ట్ మృతి
ఓ వ్యక్తి ఓ క్లబ్బులో మద్యం ఆఫర్ ఉందని కక్కుర్తి పడ్డాడు. అంతటితో ఆగలేదు. తన స్నేహితుడితోపాటు వెళ్లి విచ్చలవిడిగా ఆల్కహాల్ స్వీకరించాడు. ఆ క్రమంలో క్లబ్ సిబ్బంది సైతం అతన్ని ఇంకా తాగాలని ఫోర్స్ చేశారు. దీంతో అతను పరిమితికి మించి మద్యం తీసుకుని చివరకు మృత్యువాత చెందాడు. ఈ ఘటన పోలాండ్‌లో(poland) జరిగింది.
ఒక బ్రిటిష్ వ్యక్తి పోలిష్ క్లబ్లో రాత్రిపూట 90 నిమిషాల్లో 22 షాట్ల మద్యం తాగి మృత్యువాత(British tourist died) చెందాడు. మార్క్ సిగా గుర్తించబడిన 36 ఏళ్ల బాధితుడు.. క్రాకోలోని ఓ వైల్డ్ నైట్ క్లబ్‌కు స్నేహితుడితో కలిసి వెళ్లాడు. అయితే అతను అప్పటికే తాగి ఉన్నాడు. ఉచిత ప్రవేశం ఆఫర్ ద్వారా ఈ జంట క్లబ్‌లోకి వెళ్లింది.
ఆ క్రమంలో మార్క్ డ్రింక్స్ తిరస్కరించేందుకు ప్రయత్నించాడు. కానీ వారిని మరింత మత్తులో పడేయడానికి సిబ్బంది అతనిని మరిన్ని షాట్లు వేయమని ఒప్పించారు. ఆ నేపథ్యంలో అతను కుప్పకూలేవరకు రెండు డజన్ల శక్తివంతమైన షాట్లు స్వీకరించాడు. దీంతో తరువాత అతను మరణించాడు. అతను కుప్పకూలిన తర్వాత క్లబ్‌లోని సిబ్బంది అతని వద్ద ఉన్న 2,200 పోలిష్(poland) (రూ. 42,816) నగదును సైతం దోచుకున్నారు.
అయితే అతను మరణించే సమయంలో అతని రక్తంలో ఆల్కహాల్(alcohol) కంటెంట్ కనీసం 0.4 శాతం ఉందని వైద్యులు గుర్తించారు. ఆల్కహాల్ పాయిజనింగ్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.3 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మరణం సంభవించవచ్చని వైద్యులు నిర్ధారించారు.
అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. 2017లో చోటుచేసుకుంది. పర్యాటకుడి మరణానికి సంబంధించి ఇటీవలే పోలిష్ పోలీసులు(police) 58 మందిపై ఈ క్రైమ్ లో భాగంగా అభియోగాలు మోపింది. ఈ కేసును దర్యాప్తు చేసిన అధికారులు విచారణలో భాగంగా ఓ బాధితుడు మత్తులోకి వెళ్లి, స్పృహ కోల్పోయి మృతికి కారణమయ్యారని తెలుసుకుంటారు. ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించబడలేదు. దీంతోపాటు క్లబ్లో డబ్బును దొంగిలించేందుకు కస్టమర్లను తాగించేలా రాకెట్‌ను నడుపుతున్నాయని పోలీసులు తెలుసుకుంటారు. బాధితుల మానసిక, శారీరక స్థితి ఆధారంగా వారు ప్లాన్ వేసినట్లు చెప్పారు.