BPT: సూర్యలంక సముద్రతీరంలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ జేసీ గంగాధర్ గౌడ్ పరిశీలించారు. ఆదివారం తీరం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలను అధికారులను వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.