GDWL: ఇటిక్యాల-ఉదండపురం గ్రామాల మధ్య ప్రధాన రహదారి భారీ వాహనాల రాకపోకల వల్ల పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని గ్రామస్థులు, వాహనదారులు కోరుతున్నారు.