KRNL: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శనివారం కర్నూలులో నూతన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరిని కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలోని ధనాపురం-హొళగుంద రోడ్డు దయనీయంగా ఉందని, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరారు. అలాగే, ఆలూరు, కమ్మరచేడు ప్రభుత్వ ఆసుపత్రులను పునరుద్ధరించాలని, హొళగుందలో ఎస్సీ హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.