»Pushpa 2 Glimpse Video 100 Million Views Hindi Language Also Record
PUSHPA 2: ‘పుష్ప2’ రికార్డ్ బ్రేకింగ్.. 100 మిలియన్స్ కొట్టేశారు!
ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప మూవీ. కానీ పుష్ప రిజల్ట్ చూశాక.. బన్నీ, సుకుమారే కాదు, తెలుగు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మెల్లి మెల్లిగా మౌత్ టాక్‌తో ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప2(PUSHPA 2)ని భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్టే పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది.
తెలుగులో కంటే హిందీలో పుష్పరాజ్ దుమ్ముదులిపేసిన సంగతి తెలిసిందే. అందుకే సెకండ్ పార్ట్ కోసం తెలుగు వాళ్ల కంటే.. హిందీ వాళ్లే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప2 గ్లింప్స్‌కి.. హిందీలో ఊహించని వ్యూస్ వస్తున్నాయి. అసలు అల్లు అర్జున్‌కి పుష్ప మూవీ బాలీవుడ్లో ఇంత క్రేజ్ తెచ్చిపెట్టిందా అని.. అక్కడి వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎంతలా అంటే.. బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని రికార్డులని పుష్ప2 గ్లింప్స్ క్రియేట్ చేస్తోంది. ఒక్క హిందీలోనే పుష్ప2(PUSHPA 2) వీడియోకి 10 రోజుల్లో 65 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
తెలుగులో జస్ట్ 26 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఈ లెక్కన ఇక్కడ కంటే.. హిందీలో ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక తమిళంలో 5.3 మిలియన్ వ్యూస్. కన్నడలో 1.3 మిలియన్ వ్యూస్.. మలయాళంలో 2.2 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది పుష్ప2 గ్లింప్స్.
మొత్తంగా పది రోజుల్లో అన్ని భాషల్లో కలిపి.. యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేశాడు పుష్పరాజ్. అలాగే 3.3 మిలియన్స్ పైగా లైక్స్ సొంతం చేసుకున్నాడు. మరి పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా ‘పుష్ప: ది రూల్’ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.