»Telangana Fish Food Festival From June 7 To 9 Says Minister Talasani Srinivas Yadav
తెలంగాణవ్యాప్తంగా Fish Food Festival.. ఎప్పటి నుంచి అంటే..?
ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేపలు తినాలనే ఓ నమ్మకం ఉంది. ఇక ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కడా చూసినా చేపల ఘుమఘుమలే. మరి అలాంటి మృగశిర కార్తె రోజు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టనుంది.
భారతదేశంలోనే చేపల మందుకు (Fish Medicine) ప్రత్యేకత సాధించింది హైదరాబాద్ (Hyderabad). ఉబ్బుసం వ్యాధితో బాధపడే వారికి బత్తిన సోదరులు (Battina Brothers) ఇచ్చే చేప ప్రసాదం భారీ ఉపశమనం లభిస్తుందనే విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె (Mrigasira Karthi) రోజు చేపలు తినాలనే ఓ నమ్మకం ఉంది. ఇక ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కడా చూసినా చేపల ఘుమఘుమలే. మరి అలాంటి మృగశిర కార్తె రోజు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టనుంది. మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ (Fish Food Festival) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాల వివరాలను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వెల్లడించారు.
‘మృగశిర కార్తె సందర్భంగా జూన్ 7, 8, 9 తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తాం. అయితే ఒక్క హైదరాబాదే కాదు రాష్ట్రవ్యాప్తంగా (Statewide) ఈ ఫెస్టివల్ ను నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు అనువైన స్థలాలు గుర్తించాలని, మే నెలాఖరు వరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించాం’ అని తలసాని తెలిపారు. ఈ ఉత్సవాలపై సోమవారం తన శాఖ కార్యాలయంలో అధికారులతో సమావేశమై చర్చించారు. వీటితో పాటు రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘కోహెడలో (Koheda) హోల్ సేల్ చేపల మార్కెట్ (Fish Market)ను ఏర్పాటు చేస్తాం. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ (Sheep Distribution) కార్యక్రమం విజయవంతంగా చేయాలి. నాణ్యమైన మాంసాన్ని ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడమే మటన్ క్యాంటీన్ (Mutton Canteen) లక్ష్యం. వాటి నిర్మాణ పనులు వేగంగా జరగాలి. రంగారెడ్డి జిల్లా మండలం కంసాన్ పల్లిలో 37 ఎకరాల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో నాణ్యమైన పశువీర్య ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తున్నాం. గొర్రెలు, పశు సంపద అభివృద్ధి కోసం రైతులకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల కోసం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 55 ఎకరాల స్థలంలో ప్రతిభా కేంద్రం ఏర్పాటుకు రూ.18.50 కోట్లు మంజూరయ్యాయి’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పశు సంవర్ధక, పాడి, మత్య్స శాఖలపై నిర్వహించిన ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్ గుప్తా, షీఫ్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, విజయ డెయిరీ ఇన్ చార్జి ఎండీ అదార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరోజిరావు తదితరులు పాల్గొన్నారు.