KRNL: దేవనకొండ MPDO కార్యాలయంలో అధికారుల పేర్లు సూచించే బోర్డుపై గందరగోళం నెలకొంది. కొందరి పేర్లు లేకపోగా, మరికొందరి పేర్లు పేపర్‌పై ఉండటాన్ని స్థానికులు విమర్శిస్తున్నారు. దీంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు సంబంధిత అధికారులను గుర్తించడం కష్టమవుతోందని అంటున్నారు. పూర్తి వివరాలతో బోర్డును సరిచేసి ప్రజలకు స్పష్టమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.