విజయనగరం జిల్లా బొబ్బిలిలో వేణుగోపాలస్వామి వార్షిక డోల యాత్ర (తెప్పోత్సవం) ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఫూల్బాగ్లోని పుష్కరిణిలో వేణుగోపాలస్వామి రుక్మిణి, సత్యభామలతో కలిసి పడవలో విహరించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. వసంత ఋతువు ప్రారంభంలో జరిగే ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ అర్చకులు, భక్తులు స్వామివారి విగ్రహాన్ని డోల మఠానికి ఘనంగా తీసుకువెళ్లారు.