RR: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలబడి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత ఇంటి కల నిజం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణ పథకం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు.