Kushboo: మా అత్త ఆయుష్షు పెంచాడు… ధోనీపై ఖుష్బూ ప్రశంసలు..!
మహేంద్ర సింగ్ ధోని(ms dhoni)కి క్రికెట్ తోపాటు ఇతర రంగాల్లో ఉన్నవారు కూడా అభిమానులుగా ఉంటారు. ఈ క్రమంలో నటి ఖుష్బూ(Kushboo) తన అత్తగారు ధోనీకి పెద్ద అభిమానిని అని తెలిపారు. అంతేకాదు ధోనికి ఖుష్బు థాంక్స్ చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అసలు ఎందుకు అలా చేశారో ఒకసారి ఇప్పుడు చుద్దాం.
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(ms dhoni)కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆయనకు దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానుల్లో చిన్న పిల్లల నుంచి … ముసలివాళ్లు కూడా ఉన్నారు. ఆయన ఆట తీరుకీ, వ్యక్తిత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సంగతి పక్కన పెడితే…. సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ(Kushboo) తాజాగా ధోనీపై ప్రశంసలు కురిపించారు.
ఖుష్బూ అత్తగారు కూడా ధోనీకి వీరాభిమాని. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఖుష్బూ భర్త సి.సుందర్ తల్లి కూడా ధోనీని విపరీతంగా అభిమానిస్తారట. ఆ అభిమానమే ఆమెను ధోనీ ఆతిథ్యం అందుకునేలా చేసింది. ధోనీని తన అత్తగారు కలిశారని ఖుష్బూ వెల్లడించారు.
“హీరోలు తయారు కారు… వాళ్లు పుడతారంతే. ధోనీ ఈ విషయాన్ని నిరూపించాడు. ధోనీ సహృదయత, ఆతిథ్యం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ధోనీ మా అత్తగారిని కలిశాడు. ఆమె వయసు 88 సంవత్సరాలు. ధోనీ అంటే పడిచచ్చిపోతుంది. ఆమెకు ధోనీ తప్ప మరెవ్వరూ నచ్చరు. మాహీ… నువ్వు ఆమెను కలవడం ద్వారా ఆమె ఆయుష్షును, సంతోషాన్ని మరింత పెంచేశావు. అందుకు నీకు ధన్యవాదాలు. ఈ భేటీని సాకారం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి రుణపడి ఉంటాను” అంటూ ఖుష్బూ ట్వీట్ చేశారు. అంతే కాదు, తన అత్తగారు ధోనీని కలిసినప్పటి ఫొటోలు కూడా పంచుకున్నారు.