MDK: ఇంటి నుంచి వెళ్లిన ఒక యువకుడు అదృశ్యమైన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. ఎల్కపల్లి గ్రామానికి చెందిన వల్లూరి పవన్ కళ్యాణ్(25) అనే యువకుడు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.