SRD: జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ ఈనెల 15వ తేదీన జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులని చెప్పారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు.