NGKL: బైక్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన వంగూర్ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట (M) అక్కారం తాండాకు చెందిన బాలునాయక్ తన భార్య కళతో కలిసి కల్వకుర్తి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వంగూర్ గేటు వద్ద బైక్పై నుంచి కళ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది.