టాలీవుడ్ నటడు అలీ… ఇటు సినిమాలతోపాటు… అటు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ విజయానికి తన వంతు సహాయం చేశాడు. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా పదవిని కేటాయించాడు.
అయితే ఈ పదవి దక్కినందుకు ఆలీ సంతోషం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఆలీ పెద్ద కుమార్తె నిశ్చితార్థం హైదరాబాదులో ఘనంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా హల్ది ఫంక్షన్ కూడా చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ క్రమంలో తన కూతురి వివాహానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆలీ ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా కలిసిన అలీ..తన కూతురు పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలిసిన ఆలీ ఆమెను కూడా తన కూతురు వివాహానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అయితే అలీ ఆహ్వానం అందుకున్న గవర్నర్ కూడా తన కూతురు వివాహానికి తప్పకుండా హాజరవుతానని తెలిపినట్లు సమాచారం. ఇలా అలీ కూతురి వివాహ మహోత్సవంలో సినిమా సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకుల కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.