Yuvagalam : కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన లోకేశ్ యువగళం
టీడీపీ (TDP) యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagaḷam) పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు యాత్ర కర్నూలు జిల్లా(Kurnool District)లోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గం(Don Constituency) లో యాత్ర అడుగుపెటింది.మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది.
టీడీపీ (TDP) యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. ఈ రోజు యాత్ర కర్నూలు జిల్లా(Kurnool District)లోకి ప్రవేశించింది. డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గం(Don Constituency) లో యాత్ర అడుగుపెటింది.మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) లో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు చిత్తూరు(Chittoor), అనంతపురం జిల్లాలో 874.1 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర (Padayatra) చేశారు. అనంతలో పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా అభిమానులకు యువనేత లేఖ రాశారు. ‘‘జిల్లాలో ప్రజల బాధలు విన్నాను.. సమస్యలు చూశాను.. పరిష్కార బాధ్యత నేనే తీసుకుంటాను’’… పాదయాత్రను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బహిరంగ లేఖ విడుదల చేశారు.ఈ జిల్లా మనవడినని హంద్రీనీవా కాలువ(Handriniva canal)ను రెండు దశల్లో పదివేల క్యూసెక్కులకు విస్తరిస్తామని జగన్ మాయ హామీలిచ్చారు.
విస్తరణ మాట విస్మరించి సాగుతున్న పనులను కూడా నిలిపివేశారు. నాలుగేళ్లలో హంద్రీనీవా పథకాన్ని నిర్లక్ష్యం చేసి అనంతపురం జిల్లాకు సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని ఆయన విమర్మించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంద్రీనీవా విస్తరణ పనులను కొనసాగించడంతో పాటు ఆయకట్టుకు నీళ్లిచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను’ అని జగన్ చెప్పారని ఆయన వెల్లడించారు. ఉరవకొండ (Uravakonda) నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు నీళ్లిచ్చే బిందుసేద్యం పథకాన్ని వైసీపీ(YCP) సర్కారు నిలిపేసిందని లోకేశ్ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే దాన్ని మళ్లీ ఆరంభిస్తామని చెప్పారు. నాటి టీడీపీ ప్రభుత్వం కృషితో వచ్చిన కియా (KIA) కరువు నేలలో కార్లతో పాటు ఉద్యోగాల పంట పండిస్తోందని అన్నారు. కియా రాకతో మారిన ఈ ప్రాంత ముఖచిత్రాన్ని చూసి, ఉప్పొంగిపోయానని చెప్పారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, కియా అనుబంధ సంస్థలని అనంతపురం జిల్లాకే తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ-ఉపాధి(Employment )అవకాశాలు కల్పిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.