»Drinking Beer Eating Meat Can Cause Cancer European Organization Warns
Cancer : బీర్ తాగుతూ మాంసం ఎంజాయ్ చేస్తున్నారా..? క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
Cancer : ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు.. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా ... మాంసం తింటున్నారు. ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ ఆహారాల కారణంగా.. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా.. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.
ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు.. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా … మాంసం తింటున్నారు. ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ ఆహారాల కారణంగా.. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా.. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. మనం తీసుకునే చాలా ఆహారాల్లో క్యాన్సర్ కి కారణమయ్యే రసాయనాలు ఉంటున్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది.
క్యాన్సర్కు కారణమయ్యే నైట్రోసమైన్ అనే రసాయన సమ్మేళనం రోజువారీ ఆహారంలో కనుగొన్నారు. ఈ రసాయన సమ్మేళనం ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తుందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇటీవల హెచ్చరించింది.
నైట్రోసమైన్లు ఉద్దేశపూర్వకంగా ఆహారంలో చేర్చరట. అయితే, ఇది ఆహార తయారీ , ప్రాసెసింగ్ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇవి మానవ డిఎన్ఎను దెబ్బతీస్తాయని యూరోపియన్ యూనియన్ నిర్వహించిన కొత్త అధ్యయనం తెలిపింది. యూరోపియన్ యూనియన్ జనాభాలో అన్ని వయసుల వారికి, ఆహారంలో నైట్రోసమైన్లకు గురికావడం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పరిశోధనలో తేలింది.
ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసం, ప్రాసెస్ చేసిన చేపలు, కోకో, బీర్ , ఇతర ఆల్కహాలిక్ పానీయాలలో నైట్రోసమైన్లు ఉన్నట్లు గుర్తించారు. నైట్రోసమైన్ అత్యధిక మొత్తంలో మానవ శరీరంలోకి మాంసం నుంచి ప్రవేశిస్తుందట..
నైట్రోసమైన్స్ తీసుకోవడం తగ్గించడానికి వివిధ రకాల ఆహారాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలని ఒక అధ్యయనం సూచిస్తుంది.